ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సర్పంచ్ చింతల.నారాయణ కొత్త వీధిలైట్లు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతల.నారాయణ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీధులకు వీధిలైట్లు వేయడం జరిగిందని, పైపులైన్లు మరమ్మత్తులు కూడా చేపించడం జరిగిందని, అన్ని వీధులలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా రోడ్ల పక్కన ఉన్న కంప పొదలను తొలగించి విశాలం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకుడు చింతల కుమారస్వామి, ఉప సర్పంచ్ ఆజనేయులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News