ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా సంక్షేమంతో పాటు,ఆదివాసీల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి కొత్తగూడెంలో రెండో విడత ఇండ్లను సామూహిక గృహ ప్రవేశాల కు శంకుస్థాపన చేయడంతో పాటు 118.4 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ రెండో విడతలో లక్ష ఇళ్లకు అనుమతులు ఇచ్చానన్నారు. సొంత ఇల్లు ఇవ్వాలన్నదే నా ఉద్దేశం అన్నారు. ఆదిలాబాద్ ఆదివాసీలో బిడ్డలకు సొంత ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఆదివాసి ప్రజలకు 100 శాతం ఇండ్లు ఇస్తానన్నారు. నాగోబా జాతర కూడా ఆదివాసుల కోరిక మేరకు నిధులు ఇచ్చామన్నారు. మా కోడలల్లో ఆదివాసులకు పక్క ఇల్లు లేవు ఇవ్వాలని కోరాగా వెంటనే కృప నిర్మాణ అధికారులను పిలిపించి గూడాలలో లంబాడి తండాలలో పేదవారందరికీ ఇండ్లు ఇస్తాం.ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ గడ్డమీద ప్రారంభిస్తున్నాను అని తెలిపార 70 ఏళ్లు ఆదిలాబాద్ కు జరిగిన అన్యాయణానికి పరిష్కారం చేస్తామన్నారు. మొక్కవోని దీక్షతో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కూచేస్తామన్నారు. రైతులను ఆదుకోవడమే నా ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల పండించిన ప్రతి ఒక్క వడ్ల గింజను కూడా కొనుగోలు చేస్తానని దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలన్నారు. ఆదివాసి బిడ్డల సొంతింటి కల నెరవేర్చకపోతే నెరవేరినట్టే నాలుగో నాగోబా జాతరకు ఆహ్వానించినప్పుడు మీకేం కావాలని ఆదివాసి పెద్దలను పిసిసి అధ్యక్షుడు నిరసన ఇక్కడ చేపట్టానన్నారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లా చూడాలని నేను కోరుకుంటున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకోవడం గొప్పదన్నారు. వివక్ష లేని అభివృద్ధి చేయాలనే తన ధ్యేయమన్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులు కూడా మీ పరిధిలో ఎన్ని గూడాలు ఉన్నా కూడా నా దృష్టికి తెచ్చినట్లయితే గుడిసె కూడా ఉండదు ఇడ్లిచే బాధ్యత నాదన్నారు. ఇన్చార్జి మంత్రి జిల్లాల నుండి గూడెంలో గుర్తించండి. పరిస్థితి చూడండి తర్వాత నాకు నివేదిక ఇవ్వండి అన్నారు. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లా గూడెంలలో అందరికీ పెళ్లిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు నిధులు ఇస్తానన్నారు. గూడెంలో ఒక గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొను కూడా పేద ప్రజలు నాది కూడా అన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలంటే కష్టమైన కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. టాటా బిర్లా, ఆదాని, అంబానీ లకు కూడా వారికి సొంత గృహాలు లేవా అలా గే నా ప్రజలు ఉండకూడదా అన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పటికి ఒక లక్ష ఇరవై వేల ఇళ్లను 13 నెలల లోపల ప్రారంభించామన్నారు. తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఇస్తా అన్నారు. ఆదివాసీల కోసం తల తాకట్టు పెట్టైనా 21 వేల ఇళ్లకు నిధులు ఇస్తానన్నారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే అవసరం లేదా మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చేస్తున్నారని అన్నారు. వరి, మొక్కజొన్న, కందులు,జొన్నలు కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. కొనుగోలు చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దే అన్నారు. తుమ్మిడి హెట్టి దగ్గర మహారాష్ట్ర సీఎం తో చర్చిస్తామన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాం అన్నారు. ఆదిలాబాద్ కదిలితే మహారాష్ట్రకే నష్టం అన్నారు. నీళ్లు రైతుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్, ఎంపీ గడ్డం వివేక్,ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, పాల్వాయి హరీష్ బాబు,వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్, కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విటల్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు కార్యకర్తలు ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News