Thursday, 30 July 2026 07:17:35 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Date : 07 July 2026 11:39 PM Views : 72

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలజిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం, దండేపల్లిమండలంలోని మేదరిపేట గ్రామపంచాయతీ కార్యాలయం లలో ఏర్పాటు చేసిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం హెల్ప్ డెస్క్ లను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజ్ ప్రక్రియ వేగవంతం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల తహసిల్దార్ కార్యాలయాలను బి సెక్షన్ సూపరింటెండెంట్ తో కలిసి సందర్శించి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, భూ సేకరణ సంబంధిత అంశాలపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగాభూసమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ ఇతర సేవలను, భూ సంబంధిత సర్వీసులను నిబంధనల ప్రకారం వేగవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతోస్నేహపూర్వకంగా మెలగాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :