Friday, 31 July 2026 04:31:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కేసీఆర్‌కు యాదాద్రి రేవంత్‌కు భద్రాద్రి..

ఇది పరిపాలన అధ్యక్షుల తీరు...

Date : 27 March 2026 09:40 PM Views : 149

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయ అభివృద్ధి విషయంలో పదేళ్లుగా నెలకొన్న స్తబ్దతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. భద్రాద్రి రాముడి ఆలయ పునర్నిర్మాణం తో పాటు పరిసరాల అభివృద్ధి కోసం ఏకంగా రూ. 586 కోట్ల భారీ వ్యయంతో మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు. తొలి విడదల నిధులు విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో యాదాద్రిని అద్భుతంగా నిర్మించినప్పటికీ, భద్రాచలం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ మొదటి రెండేళ్లు పాటించినా ఆ తర్వాత క్రమంగా దూరమయ్యారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా, ఆ నిధులు ఎప్పుడూ ఆలయ అభివృద్ధికి చేరలేదు. భద్రాచలం వెళ్తే పదవి పోతుందనే ముఖ్యమంత్రి సెంటిమెంట్ కారణం వల్ల కేసీఆర్ అటువైపు చూడలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అలాంటి సెంటిమెంట్లను పట్టించుకోని రేవంత్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ విస్మరించిన క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అటు హిందూ ఓటు బ్యాంకుతో పాటు ఇటు స్థానిక ప్రజలకు బలమైన సంకేతం పంపాలని ఆయన భావిస్తున్నారు. మూడు దశల్లో చేపట్టబోయే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరి కరకట్ట నిర్మాణం, భక్తుల కోసం అధునాతన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ వంటివి ఉన్నాయి. మొత్తం రూ. 586 కోట్ల ప్రాజెక్టులో తొలి దశలో కేటాయించిన రూ. 351 కోట్లతో అత్యవసర పనులను ప్రారంభించనున్నారు. వర్షాకాలంలో భద్రాచలాన్ని ముంచెత్తుతున్న గోదావరి వరదల నుంచి పట్టణాన్ని కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలయ మాడ వీధుల నిర్మాణం, అన్నదాన సత్రాలు, పార్కింగ్ వసతుల కల్పన వంటివి రెండో దశలో చేపట్టనున్నారు. భక్తితో పాటు రాజకీయం కూడా అలవాడ చేసుకున్నారు. కేసీఆర్ ఏ క్షేత్రాలను నిర్లక్ష్యం చేశారో, వాటినే లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. యాదాద్రి కంటే భద్రాచలం పురాతనమైనదని, దానికి సరైన గుర్తింపు లేకపోవడం అన్యాయమని రేవంత్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి భద్రాచలం రూపురేఖలు మారిస్తే, అది రేవంత్ రెడ్డి సర్కార్‌కు అతిపెద్ద రాజకీయ ఆస్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :