Monday, 15 June 2026 03:17:48 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం...

గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయా అభివృద్ధికి రూ.58 కోట్లు మంజూరు

Date : 13 June 2026 08:42 PM Views : 40

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తెలంగాణ అన్నవరం గా ప్రసిద్ధి చెందిన గూడెం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ పునః నిర్మాణ పనులకు శనివారం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపి వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ,పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పూర్తయిన మూడేళ్ల సందర్భంగా పిప్పిరిలో నిర్వహించిన సభలో గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనుల ప్రస్తావన వచ్చిందన్నారు. ఆ సభ జరిగిన 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి,శనివారం భూమిపూజ నిర్వహించడం ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. దాదాపు రూ. 70 కోట్ల భారీ నిధులతో గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేవలం రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆయన వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్రములోని ఆధ్యాత్మిక క్షేత్రాల పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ రెండున్నర ఏళ్ల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 2,216 కోట్లు మంజూరు చేసిందని ఆయన ప్రకటించారు. గతంలో మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైన వసతులు, ఘాట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ. 1,000 కోట్లను మంజూరు చేసిందన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 802 కోట్లు కేటాయించి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రజలనమ్మకాలను, వారి కోరికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు.

డ్వాక్రా మహిళలకు ప్రత్యేక భవనాలు ఉండాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్క భవనానికి 10 లక్షలు మంజూరు చేసిందని అన్నారు. ఆధ్యాత్మికతతో పాటు దండేపల్లి మండల ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందులో భాగంగా గూడెంగుట్ట పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల పథకం) పనుల కోసం రూ. 74 కోట్లు కేటాయించి,భూమిపూజ చేసుకోవడం శుభపరిణామమన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత, సాగునీటి రంగాల అభివృద్ధికి బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావునుభట్టి విక్రమార్కమనస్ఫూర్తిగా అభినందించారు. కేవలం అధికార హోదాను అనుభవించడం కాకుండా, నిరంతరం ప్రజల కోసం సేవ చేయడమే ప్రజాప్రతినిధి బాధ్యత అని ప్రేమ్‌సాగర్ రావు నిరూపిస్తున్నారన్నారు, గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, రాబోయే రోజుల్లో జరిగే ప్రారంభోత్సవ మహోత్సవంలో కూడా మనమందరం ఇదే ఉత్సాహంతో పాల్గొందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, సిపి అంబార్ కిషోర్ ఝూ, ఎమ్మెల్యేలు మాక్కాన్ సింగ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి, డిసిపిభాస్కర్, ఎసిపి ఆర్ప్రకాష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :