Saturday, 01 August 2026 08:33:36 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల...

Date : 31 July 2026 09:46 PM Views : 16

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మరియు కళాశాల బోధనా సిబ్బంది కలిసి డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ ను శుక్రవారం కళాశాలలో విడుదల చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్యూనివర్సిటీలో చేరడానికి ఆగస్టు 7 చివరితేదీ అని దూరవిద్యలో డిగ్రీ చదవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీలోగా అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. సంతోష్ మహాత్మా మరియు ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్ సపోర్ట్ సెంటర్ (స్టడీ సెంటర్) కోఆర్డినేటర్ డా. తన్నీరు సురేష్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట కేంద్రంగా నడుస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్ సపోర్ట్ సెంటర్ (స్టడీ సెంటర్) నెంబర్ 232 లో బిఎ, బిఎస్సి, బీకాం అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు, గృహిణులు చదువు మధ్యలో ఆపివేసి మళ్ళీకొనసాగించాలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు ఎవరైనా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్ సపోర్ట్ సెంటర్ (స్టడీ సెంటర్) నెంబర్ 232 లో డిగ్రీలో అడ్మిషన్ పొందడం ద్వారా చదువు పూర్తి చేసి డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికెట్ పొందవచ్చు. డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికెట్ యూజీసి గుర్తింపు పొందినది మరియు కేంద్ర మూల్యంకన సంస్థ న్యాక్ చే ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఇందులో చదువు పూర్తి చేసిన వారు రెగ్యులర్ డిగ్రీ చదివిన వారితో సమానంగా అన్ని రకాల అవకాశాలకు అర్హులు అవుతారు. అంతేకాకుండా అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు డిగ్రీ పూర్తయిన తర్వాత అందించే ఉద్యోగ ప్లేస్ మెంట్ కోసం అర్హత పొందుతారు అన్నారు. పని చేసుకుంటూనే చదువుకునే అవకాశాన్ని ఓపెన్ యూనివర్సిటీ కల్పిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. డా. బి ఆర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఆగస్టు 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 8790569436 మరియు 9032689657మొబైల్ నెంబర్ లో సంప్రదించవచ్చు లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోని డా. అంబేద్కరే ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ను అన్ని పనిదినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వయంగా సంధర్షించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్, కోఆర్డినేటర్ డా. తన్నీరు సురేష్ అధ్యాపకులు డా. సంతోష్ కుమార్, డా. తిరుపతి , జాడి శంకరయ్య,లైబ్రేరియన్ నాగేశ్వర్,సంధ్యారాణి, రాజ్ కుమార్, మల్లయ్య , శ్రీనివాస్, కవిత ఓపెన్ యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది సత్యనారాయణ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :