ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడిన రథోడ్ గణేష్, (ఏ 1), అర్జున్ ఆడే (ఏ 2)లను బోథ్ పోలీసులు కేసును త్వరగా చేదించి అరెస్ట్ చేశారు. నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇంటి పనివాడే నేరానికి సహకరించిన విషయం శుక్రవారం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితుల వద్ద నుంచి 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులునిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వ రించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. కేసును ఛేదించిన బోథ్ పోలీసు బృందాన్ని సీఐ డి. గురుస్వామి అభినందించారు.
Admin
E Nivas News