Saturday, 01 August 2026 08:33:19 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 31 July 2026 09:52 PM Views : 11

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ లతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు చెత్త సేకరణ, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామంలోని చెరువును మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. చెరువు పరిస్థితి, నీటి నిల్వలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోనివెంకట్రావుపేట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమ ఇండ్లను నిర్ణీత విస్తీర్ణంలో త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ, ఓ.పి., ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోసంబంధితఅధికారులుతదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: