Saturday, 01 August 2026 08:36:09 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు

Date : 31 July 2026 10:25 PM Views : 16

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) సంజీవయ్యను శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ అనేది సహజమైన ఘట్టమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన సంజీవయ్య సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా మీకు ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు,మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని,మీ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్,ఏఓ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, ఆర్ఐ రమేష్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :