ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలతో మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, మంథని మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులకు సంబంధించి మైనార్టీ, మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. మంథని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా పరిమిషన్ లో గాని ప్రజాలకు అందాల్సిన పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ముందు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. మంథని పట్టణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, విద్య, వైద్యం, పట్టణ సౌకర్యాలు వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించారని, వాటిని ఆచరణలో పెడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరి చేరలేదని, ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ బిఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామన్నారు. మేము ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ, మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు, అనారోగ్య బాధితులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంపు లాంటి హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
Admin
E Nivas News