Thursday, 30 July 2026 01:46:11 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో 50వేల ఉద్యోగాలు ఇచ్చింది

ఎంపీ గడ్డం వంశి

Date : 27 October 2025 07:23 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిందని పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో దాదాపు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం గర్వకారణంఅన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు అని తెలిపారు. అలాగే వివిధ కంపెనీలు సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి జాబ్ మేళాలను సింగరేణి యాజమాన్యం సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహిస్తే, మరెంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల నేను దేశం తరఫున యుఎన్ఓ సమావేశంలో దేశ ప్రతినిధిగా పాల్గొని, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు నిరుద్యోగ సమస్యపై వివరంగా మాట్లాడానన్నారు. మన రాష్ట్రంలో ఉన్న నైపుణ్యం గల యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటగల సామర్థ్యం కలిగివున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి డైరెక్టర్ పి పి వెంకటేశ్వర్లు,మందమర్రి సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :