ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంగత్త ఆశలతో ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ బుధవారం భోగి వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. కష్టాలు కన్నీళ్లు బాధలు భోగిమంటలలో పోవాలని కొత్త ఆనందాలు సంతోషాలు వెల్లివిరిగాలని ఆనందంగా భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా సంధ్యా సమయాన్ని భోగి మంటలు వేశారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే భోగి పండగ రోజు వేసే మంటలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంతోషంగా భోగి మంటలను ఆస్వాదించారు. చిన్నపిల్లలకు ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని తల్లిదండ్రులు భోగి పండ్లు పోశారు. ఎక్కడ ఏంటి ముందు చూసినా కూడా రకరకాల రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం జరిగే మకర సంక్రాంతి పర్వదినానికి సైతం ప్రతి ఇంట్లో బంధువులు రావడంతో ఇండ్లన్నీ కలకలలాడుతున్నాయి.
Admin
E Nivas News