ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణం చాలా విలువైందని, దానిని రోడ్డు ప్రమాదాల వల్ల కోల్పోవడం దురదృష్టమని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడాలని ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. శనివారం నుండి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో రాష్ట్రంలో కూడా రోడ్డు భద్రత మహోత్సవాలను జరుపుటకు ఈ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం విఐ సూర్య తేజ మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ నియమ నిబంధనలకు గురించి విద్యార్థులకు వివరించారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని అతివేగం ప్రమాదకరమన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలన్నారు. ఫోర్ వీలర్ నడిపేవారు వారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. లేనిపక్షంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. లేనిపక్షంలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో ఎం విఐ సూర్య తేజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి. ఆరిఫ్, జూనియర్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News