ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ ఎఫ్ కాలనీలో ముత్తు బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ డే వేడుకల్లో శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2030లో జరిగే కామన్ వెల్త్ క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రీడాకారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని క్రీడాకారులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ, మాజీ కౌన్సిలర్ బాల్క శ్యామ్, సంతోష్ ఠాకూర్, ప్రిన్స్, సౌరబ్ ధాత్రక్, హబీబ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News