ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజ్యం నడుస్తుందని రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ముందుకు సాగుతున్న శ్రీధర్ బాబును, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రైతులపై మొసలి కన్నీరు కార్చే పుట్ట మధుకు లేదని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నలు అన్నారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధు శుక్రవారం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మిల్లర్లు దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేసి క్వింటాకు రెండు నుండి ఐదు కిలోల కోత విధించడంతో రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి తరం కాదని ముందస్తు చర్యలలో భాగంగా ధాన్యం తడవకుండా కవర్లు మార్కెట్లో అందుబాటులో ఉంచామన్నారు. గత ప్రభుత్వంలో రైతులు వరి వేస్తే ఉరి అని మీ అధినేత కేసిఆర్ బహిరంగంగానే తెలపడం జరిగిందని, మా ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఒక గింజ కోత లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు త్వరితగతిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల దృష్ట రెండు కొత్త బాయిలర్లను తీసుకోవడం జరిగింది వాటిని త్వరలోనే ట్రాన్స్ఫారం ఫీట్ చేసి వాటిని వాడుకలోకి చేసుకుంటామని వాటి ద్వారా రైతులు త్వరితగతన వడ్లను ఆరబెట్టుకొని ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News