Sunday, 21 June 2026 01:55:18 PM
# శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు # 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం...

Date : 18 June 2026 10:19 PM Views : 22

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గురువారం మరో తియ్యటి కబురు అందించింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక "రైతు భరోసా" నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. నిధుల విడుదల అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ. 9,000 కోట్ల నిధులకు సీఎం ఆమోదం ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడి నిమిత్తం ఏకంగా రూ. 9,000 కోట్ల భారీ బడ్జెట్‌ను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 73 లక్షల మంది రైతులకు లబ్ధి: ఈ సరికొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు *73 లక్షల మంది రైతులకు* నేరుగా లబ్ధి చేకూరనుంది ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సాయంగతంలో కంటే భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పునభారీ ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకోబోతోంది. పెట్టుబడి సాయంతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు వేదికల ద్వారా సబ్సిడీ విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ చేపడుతూ వ్యవసాయ రంగాన్ని పండుగ చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మధిర పర్యటన, బహిరంగ సభ విజయవంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :