ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ వర్కర్స్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ గట్టయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే మల్టీపర్పస్ వర్కర్స్ ను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నాల ఉపసర్పంచ్ దివ్య సంజీవరెడ్డి, వార్డు సభ్యులు ముసుకుల కృష్ణవేణి, కావటి రజిత సందీప్ యాదవ్, రామగిరి సంపత్, వంగల కీర్తన, పంచాయతీ సెక్రెటరీ మధుకర్, పాల్గొన్నారు.
Admin
E Nivas News