Friday, 31 July 2026 06:12:39 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

275 కోట్లతో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Date : 21 January 2026 10:08 PM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించి సుమారు రూ. 275 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభ్యర్థన మేరకు ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన తపనకు మేము స్పందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి Champions రూ. 275 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్ల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉండడానికి తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా గతంలో విద్యార్థులంద కలిసిమెలిసి చదువుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అందుకోసమే విద్యార్థిని విద్యార్థులంతా ఒకచోట ఉండి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రాష్ట్రంలో 100 ఇంటిగ్రేట్ పాఠశాలలు నిర్మాణం కోసం రూ. 22.500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా మన విద్యార్థులంతా చదువుకొని కలెక్టర్లుగా పెద్ద పెద్ద కొలువుల్లో నిలవాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటుంటే మన పేద విద్యార్థులంతా నిరుత్సాహం ఉండడం ఎందుకన్న ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కూడా సంపన్నులాగే మంచి కార్పొరేట్ విద్య చదువుకోవాలని, మంచి పౌష్టికరమైన భోజనాన్ని కూడా అందిస్తున్నామన్నారు. అలాగే మరో 63 కోట్ల40 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం కొలువుదిరిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధి ధ్యేయంగా వారికి జీరో వడ్డీకే 25 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతేగాకుండా వారంతా పండుగ కూడా సంతోషంగా అవడం ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చామన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఖాళీగా జానా తో ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. రైతాంగానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారికి ఉచిత విద్యుత్తు, రైతు భరోసా తో పాటు వారు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే రైతాంగానికి సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు తదితర పరికరాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలను కట్టుకొమ్మన్నామని వారు కట్టుకున్న విధంగానే వారానికి ఒకసారి డబ్బులు వేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం తమ్మిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :