Friday, 31 July 2026 08:34:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆదివాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం ఆపరా..

తుడుం దెబ్బ ఖండన, హక్కు పట్టాల డిమాండ్

Date : 22 June 2026 09:05 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లానచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగాతీసుకెళ్లారనిగ్రామస్తులుఆరోపించారు.బాధితులను పరామర్శించిన నాయకులు, పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడమ్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఇటీవల ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది.బాధితులను నాయకులు పరామర్శించారు. పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆదివాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోడమ్ గణేష్ మాట్లాడుతూ, పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం వెంటనే ఉమ్మడి హక్కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు రాజ్యాంగం, చట్టాలకు లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఆదివాసి గూడాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అటవీ అధికారుల వేధింపులు కొనసాగితే ప్రజా సంఘాలను ఏకం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుచేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడసం గోవర్ధన్, రాష్ట్ర నాయకులు ఆనందరావు, ఆర్క శేషారావు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిదం జంగు దేవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :