ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొరత భయంతో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. కాగా పెట్రోలియం చట్టం-1934 ప్రకారం క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం నేరం అని పోలీసు అధికారులు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానా లేదా నెల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే 5 వేల రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. ఎవరైనా అలా తీసుకు వెళ్లినట్లు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామన్నారు.
Admin
E Nivas News