Friday, 19 June 2026 01:29:24 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆకాష్ నాయక్ ఎన్నిక...

విద్యార్థి హక్కుల కోసం విస్తృతంగా పోరాటం కొనసాగిస్తా...

Date : 22 February 2026 02:41 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు శనివారం విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని మహాసభలు విజయ వంతంచేశారు. మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆకాష్ నాయక్‌ను ఆయన చేసిన నిరంతర కృషి, విద్యార్థి సమస్యలపై చురుకైన పోరాటాలను గుర్తించి రాష్ట్ర సమితి సభ్యుడిగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, ఫీజుల భారం తగ్గింపు వంటి అంశాలపై మరింత చురుకుగా పనిచేస్తానని ఆయనపేర్కొన్నారు.ఆయన ఎన్నిక పట్ల రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. యువ నాయకత్వంతో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: