Thursday, 02 April 2026 01:52:06 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు గాయం...

Date : 13 January 2026 10:38 PM Views : 132

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నిషేధిత చైనా మాంజా వాడకం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వరస మాంజ ప్రమాదాలు వాహన దారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం ఉప్పల్ లో చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం అయింది. దీంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారంనగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాపాయాన్ని సృష్టించింది. సంక్రాంతి పండుగ వేళగాలిపటాలు ఎగరేసేందుకు వాడే ఈ ప్రమాదకరమైన దారం.. విధి నిర్వహణకు వెళ్తున్న ఒక పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుచైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఉప్పల్‌లోని తన నివాసం నుండి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరా రు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్దకు చేరుకోగానే గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఆయన గొంతుకు అకస్మాత్తుగా చుట్టుకుంది. వాహనం వేగంగా ఉండటంతో మాంజా గొంతులోకి బలంగా చొచ్చుకెళ్లింది. దీంతో ఆయన గొంతుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి పోలీసులు ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యు లు చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :