Friday, 31 July 2026 12:53:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం...

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పి.చంద్రయ్య

Date : 03 March 2026 03:09 AM Views : 167

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలలో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదన కలెక్టర్ (రెవెన్యూ)శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఇతర అధికారులతో కలిసి గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ అంతం చేసేందుకు ప్రభుత్వం నడుము బిగించిందని, ఇందులో భాగంగా జిల్లాలో 14 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరంలో లోపు ఉన్న బాలికలకు సుమారు 8 వేల 184 మంది బాలికలకు హెచ్.పి.వి.వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఒక డోసు ఎడమ చేతికి ఇచ్చిన తర్వాత చూపుడు వేలికి గుర్తింపు కోసం ఇంకు పెడతారని, వివరాలను యూవిన్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగుతుందని, తర్వాత ఈ కార్యక్రమమును జాతీయ టీకాల కార్యక్రమంలో కలపడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునే పిల్లలు, ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహించి,ఈ వ్యాక్సిన్ ఉపయోగం వివరములు తెలియజేసిన తర్వాత వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ తీసుకునే పిల్లలు ఖచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసిరావాలనితెలిపారు. టీకా తీసుకున్నాక అరగంట పాటు వ్యాక్సిన్ కేంద్రంలోనే ఉండాలని, వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తిగా స్వచ్ఛందమని, అనారోగ్యంతో ఉన్నా, అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ వేయరని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పిపి యూనిట్లలో ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో,అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్యాధికారుల ఆధ్వర్యంలో టీకా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల అనుసంధానంతో, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమమును చేపట్టడంజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్.ఏ ప్రసాద్,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,డిపిఓ ప్రశాంతి, సిహెచ్ఓ లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, పద్మ,డి పి హెచ్ ఎన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: