ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హనుమకొండ వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. హన్మకొండ లోని వరంగల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేసి పలు అక్రమాలు కనుగొన్నారు. గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. హన్మకొండ సబ్ రిజిస్టార్ కు చెందిన ఖమ్మం లోని ఇంటి పై ఖమ్మం ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ దాడి చేశారు. ఈ దాడుల్లో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్టార్ ల మధ్య మొత్తం రూ 42 లక్ష ల లావాదేవీలు కనుగొన్నారు. సబ్ రిజిస్టార్ ల ఇళ్ళ లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించారు. 24 లక్షలు నగదు లభించింది. 819గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు లభించాయి.దాడిలో వరంగల్,ఖమ్మం ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News