ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లు సాధించడం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నాయకులు కాదాసీ రవీందర్ స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రం చార్వక ట్రస్ట్ హాలు నందు బీసీ విశాల మహాధర్నా గోడపత్రులు ఆవిష్కరించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గతంలో 27 శాతం బీసీ రిజర్వేషన్స్ సాధించడంలో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు, 42 శాతం బీసీ రిజర్వేషన్స్ బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు. బీసీ రిజర్వేషన్స్ సాధనకై ఇందిరా పార్క్ వద్ద జరుగు విశాల మహా ధర్నాలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలన్నారు. గోడపత్రుల ఆవిష్కరణలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగాం శ్రీనివాస్, బాంసేపు నాయకులు శెట్టి శంకరయ్య, జిల్లా మహిళా నాయకురాలు శేట్టి ప్రవళిక, మంచిర్యాల జిల్లా నాయకులు మడిపల్లి రాములు, బూడిద మల్లేష్, ఎన్ రెడ్డి తిరుపతి, కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News