ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మండే తిరుమల-గణపతి సర్పంచ్ గా విజయం సాధించిన సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో శనివారం గెలుపొందిన సర్పంచ్ మండే తిరుమల-గణపతి ని మరియు ఉప సర్పంచ్ పూదరి శ్రావణ్ ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మీపై ఎంతో నమ్మకం పెట్టి గెలిపించారని వారి నమ్మకాన్ని పంపు చేయకుండా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులు కొట్టే ఓదేష్,దానిశెట్టి మల్లేష్,వేల్తపు శ్రీనివాస్,వేల్తపు శ్రీకర్,పోతరాజుల శ్రీధర్, పూదరి జీవన్,చిందం పవన్,ఆసంశెట్టి చంద్రమౌళి మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News