Thursday, 30 July 2026 04:58:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష 2026 కు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల విద్యాలయాల సంస్థ డిసిఓ, కోటూరి రమ కళ్యాణి

Date : 23 December 2025 08:30 PM Views : 383

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 ద్వారా 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను, 5వ, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (బ్యాక్లాగ్ వేకెన్సీస్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డి సి ఓ శ్రీమతి కోటూరి రమ కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష లో వచ్చిన మెరిట్ ఆధారంగా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసి వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించబడతాయని తెలిపారు. ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష వచ్చే సంవత్సరం అనగా 2026 ఫిబ్రవరి 22 ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన బాలబాలికలు 21, జనవరి, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాములు, క్రీడా సామాగ్రితో పాటు ఐఐటి, నీట్, సియుఈటి వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని డిసిఓ రామ కళ్యాణి తెలిపారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో స్వీకరించ బడతాయని అర్హత కలిగిన బాల బాలికల తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారము ఇవ్వబడతాయని తెలిపారు. అర్హత కలిగిన బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిఓ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: