ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని చెప్పారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని, జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికా రులను ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవా లని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటిక ప్పుడు గోడౌన్స్‌కు తరలించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి,తన నివాసంలో మంగళ వారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు. ధాన్యం సేకర ణలోని సమస్యలపై వివరాలను తెలుసు కున్నారు. గత కొద్ది రోజులుగా ధాన్యం సేకరణలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగు తుందని రైతన్నలు ఆవేదనను వ్యక్తం చేశారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులోకి తీసు కురాని కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహ నాలను అందుబా టులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Admin
E Nivas News