ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని బస్ డిపో సమీపంలో పవిత్ర గోదావరి స్నానానికి వెళ్లే భక్తుల కోసం ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజు, పెరుగు తేజ, మారుతి గౌడ్ వారి బృందం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, 11వ వార్డు కౌన్సిలర్ ఓడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న జిల్లా RTA మెంబర్ మంథని సురేష్, జిల్లా మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్ లు మాట్లాడుతూ ముందుగా మంథని నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ యూత్ అధ్యక్షులు పెంటరి రాజు, వారి బృందం గత మూడు సంవత్సరాలగా అల్పాహార వితరణ చేస్తున్న వారిని అభినందించారు. ఆ పరమశివుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో 13 సీట్లగాను 11 మంది సభ్యులను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతకు బహుమతి ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజలు వారందరిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నూకల కమల్, ఎల్లెంకి వంశీ, వేముల లక్ష్మి సమ్మయ్య, పట్టణ యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News