ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఏర్పడబోయే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనిఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో విశ్రాంతి భవన ఆవరణలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల జనాభా రాష్ట్ర సగటు 2026 ప్రకారం 22 శాతంగా ఉందని, కానీ దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం, హాజీపూర్ మండల్లాల్లో 24.76 ఎస్సీ జనాభా ఉందన్నారు. కావున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంత దళితులకు అన్ని రంగాల్లో వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొల్లూరిరవికుమార్,జాడి వెంకటి, జాడి గంగాధర్, మంద శేఖర్, బెక్కెమ్ సృజన్, అవునూరి వెంకటేష్, మెడపట్ల శ్రీవరన్, తోట తిరుపతి, గారే నవీన్, ఆకెనపల్లి శిల్పతి, దుర్గం వినోద్ తదితరులుపాల్గొన్నారు. ఎస్సీ సాధన సమితి ఏర్పాటు.. సమితి చైర్మన్ గా సాయిని ప్రసాద్ నేత, కన్వీనర్ గా కొల్లూరి రవికుమార్, కో కన్వీనర్ గా దర్శనాల నవీన్, అవునూరి వెంకటేష్, మామిడి సందీప్, గోరువంతుల ప్రశాంత్, తర్లపెల్లి రాజేశ్వర్ మరో 10 మందితో నూతన కమిటీ ఎన్నుకున్నారు.
Admin
E Nivas News