ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయ తీలో బుధవారం జరిగిన గ్రామసభ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువల్లో భూములు కోల్పోయిన ప్రతాపగిరి శివారు లో ఉన్న రైతులకు ఒక ఎకరాన 20.లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వర రావు మరియు రైతులు స్థా నిక తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.సందర్భంగా సర్పంచ్ రైతుల పక్షాన మాట్లాడుతూ కొంత మంది రైతులు కొంత మేర భూమి సాగు చేస్తున్నారని.ఆ భూమి పూర్తిగా పోతే మళ్లీ ఎక్కడ కొనడానికి కాకుండా పోతు న్నారని.పూర్తిగా సర్వే చేసి ఆందోళన లో ఉన్న రైతులకు ప్రభు త్వం న్యాయం చేయాలని ఆయన కోరారు.అదేవిధంగా మాకు మీరు తహసిల్దార్ మరి యు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి మా రైతులతర ఫున తీసుకు వెళ్లాలని సర్పంచ్ అధికా రులను కోరారు.ఈకార్య క్రమం లో ఆర్ఐ వెంకయ్య.పంచా యతీ కార్య దర్శి అరికిల్ల శంకరయ్య తో పాటు అధికా రులు.చిదినేపల్లి సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి.ఉప సర్పంచ్ బియ్యన రాజయ్య. రైతులు అనం తుల రమేష్ బాబు.గోరు కంటి మాధవ రావు.దండవేన చంద్రయ్య. జక్కుల రాజయ్య.జక్కుల ఐలయ్య.బుగ్గారపు రాజేందర్. గుంటి కిష్టయ్య జక్కుల శంకరయ్య.కొండ రాములు తోపాటు తదితర రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News