Friday, 31 July 2026 04:55:31 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం..

తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్

Date : 25 April 2026 05:44 AM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైంది. కేసీఆర్ మీద కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హై కోర్టు ముందు చెల్ల లేదన్నారు. జస్టిస్ పి సి ఘోష్ కమిషన్, కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని న్యాయస్థానం తెలంగాణ సహకార సంఘం మాజీ చైర్మన్ రాజా వరప్రసాదరావు స్పష్టం చేసిందన్నారు. కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు అని బల్లగుద్ది చెప్పడం జరిగిందన్నారు. హై కోర్టు వెలువరించిన తీర్పు తాత్పర్యం ఏమిటంటే.. సాక్షులుగా పిలిచిన ( కేసీఆర్ తదితరులు) వారి మీద చర్యలు చేపట్టడం కుదరదని చర్యలు తీసుకోవాలని అనుకుంటే వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు వారి వాదనలుకూడా వి నాలన్నారు. అటువంటివి ఏమీ లేకుండా సాక్షులుగా పిలిచిన వారిని విచారణ పేరుతో అగౌరవ పరుస్తూ, ఏకపక్షంగా ఉద్దేశాలు ఆపాదిస్తూ, తప్పు పడుతూ, తలకాయ తోక లేకుండా వ్యవహరించడం తప్పు కాదా అని విమర్శించారు. చట్టం న్యాయ వ్యవస్థ పట్ల కనీస అవగాహన లేని కమిషన్ నివేదిక తప్పుల తడక అన్నారు. అటువంటి అసంబద్ధమైన పి సి ఘోష్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్రమే కానీ, సి బి ఐ ఇంకెవరైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదన్నారు. హై కోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పునివ్వడం గమనార్హం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వంపై మచ్చ వేయాలనే ఉద్దేశంతో కమిషన్‌ను ఉపయోగించిన విధానం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసిం దన్నారు. కమిషన్ విచారణ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని, సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంవారి వాదనలు వినకపోవడం వంటి లోపాల వల్ల ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదని కోర్టు తేల్చిచెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణం అన్నారు. ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలనే ప్రయత్నాల మధ్య వచ్చిన ఈ తీర్పు కేసీఆర్ , హరీశ్ రావుల పై చేసిన ఆరోపణలు తప్పుడువి అనే తేల్చిందన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలను విరమించుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కాలేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యవసాయానికి సాగునీటిని అందించాలి రైతాంగం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా మరణం చేయాలని చూసినా చివరికి ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :