ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలం షాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
E Nivas News