ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ మార్కెట్ లోగల 3,4,5,6,7,8,29 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ లు పాల్గొన్నారు. ఈసందర్భం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ 3,4,5,6,7,8,29 డివిజన్ల కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలందరికీ కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేరారు. వారందరిని పార్టీలోకి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పార్టీలోకిఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డి సి సి అధ్యక్షురాలు సురేఖ, ఎమ్మెల్యే తనయుడు చరణ్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News