ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / : పెద్దవంగర : విద్యార్థులు లక్ష్యంతో చదువుల్లో ఉన్నతంగా రాణించాలని.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యను అలవర్చుకోని అన్ని రంగాల్లో పోటీ పడేలా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీ-షర్ట్‍లు, బెంచ్‌లను గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కేతిరెడ్డి దీపిక-సోమనర్సింహరెడ్డి కుమారుడు ఎన్నారై కేతిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి రూ.1.30లక్షల ఆర్థిక సహకారంతో అందించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లోనే అన్ని రంగాల్లో దృఢమైన సంకల్పంతో మంచి లక్ష్యంతో ఉన్నత లక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పే మంచిని గ్రహిస్తూ పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. చదువుల్లో ఉన్నత స్థానం సాధించిన తర్వాత పుట్టిన ప్రాంతాన్ని ఎవరు మరువోద్దని సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎంలు లిలాశోభరాణి, తిరుపతిరెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సునీల్‌అగర్వాల్, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, వెంకటరెడ్డి, బాలరాజ్, శ్రీనివాస్, సురేష్, హరీష్, కమలాకర్, దేవులపల్లి శ్రీనివాస్, వెంకట్రామయ్య, గంగాధర్‌యాదవ్, రవి, సమ్మయ్య, రామ్మూర్తి, ఉపాధ్యాయులు సురేష్, రమేష్ బాబు, ప్రవీణ్ కుమార్, భాస్కర్, ఎల్లగౌడ్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News