ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రవేశద్వారం వద్ద గురువారంఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో లక్షెట్టిపేట మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఎలుగం దేవక్క అనే 63 సంవత్సరాల మహిళ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు లక్షెటిపేట బ్యాంకులో పని ఉండగా తన కూతురు అల్లునితో కలిసి బ్యాంకుకు వచ్చి పని ముగించుకుని తిరిగి తన కూతురు అల్లుడు బస్టాండు వద్ద దింపి వెళ్లిపోగా మృతురాలు నడుచుకుంటూ ప్రవేశద్వారం దాటుతుండగా లక్షెట్టిపేట బస్టాండ్ లోకి వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళను ఢీకొట్టడంతో కాలు నుజ్జునుజ్జై తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతు రాలి కుమార్తె ఆడెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారమైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News