ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి 12 వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Admin
E Nivas News