ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను, సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో రంగవల్లి పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించారు. రంగుల సమ్మేళనం, రూపకల్పన, సంప్రదాయ శైలిని ప్రతిబింబించే రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ కె. లక్ష్మణ్ రావు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బి. అశోక్ గౌడ్ సమన్వయంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల్లో పోటీస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఫోటో పోటీగా రంగవల్లులు వేశారు. పోటీలలో ప్రతిభ కనబరిచినవిద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేశారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, ఎంఈఓ శైలజ, హైస్కూల్ పిడి ఇందిర, లైబ్రేరియన్ కళావతి, విజయ్ పాల్గొని జడ్జిలుగా వ్యవహరించారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు చిన్నయ్య, అరవింద్, హేమా చందర్, మహేష్, రామ్ ప్రసాద్, మహేందర్, బాలాజీ, శ్రీనివాస్ రావు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News