ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని సహకారంతో గురువారం మంథని పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పోతరవేన క్రాంతి 50వ సారి రక్తదానం చేసి అర శతకం పూర్తి చేశారు. పోతరవేని క్రాంతి కుమార్ గారికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ మడత రమేష్, మంథని సి.ఐ రాజు, ఎస్.ఐ రమేష్, ఎస్ ఐ 2 సాగర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి చైర్మన్ రాజగోపాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని అధ్యక్షులు మేడగొని వెంకటేష్ లు శాలువా తో సత్కరించి అభినందనలు తెలిపారు.
Admin
E Nivas News