Friday, 19 June 2026 01:23:22 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

స‌జ్జ‌నార్‌కు పదోన్నతి..

Date : 25 April 2026 05:48 AM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా, వీవీ శ్రీ‌నివాస‌రావు, చారు సిన్హా, అనిల్‌ కుమార్‌, వీసీ స‌జ్జనార్ ఉన్నారు. ప్ర‌స్తుతం వీరంతా ఏడీజీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా వీరిలో ఒక్క స‌జ్జ‌నార్ మిన‌హా ఎవరి విష‌యాన్నీ నెటిజ‌న్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి.హైద‌రాబాద్ కొత్వాల్‌గా ఉన్న స‌జ్జ‌నార్‌పై మాత్రం ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున డిబేట్ జ‌రుగుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. కేవ‌లం తెలంగాణ నెటిజ‌న్లే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణకు చెందిన వారు ఆయ‌న సొంత రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు చెందిన వారు కూడా స‌జ్జ‌నార్‌పై విషెస్ వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆయ‌న మ‌రిన్ని ప‌ద‌వులు అలంక‌రించాల‌ని కోరుతున్నారు. ఇలా ఒక పోలీసు క‌మిష‌న‌ర్‌కు ప‌దోన్న‌తి క‌ల్పించాక‌భారీ స్థాయిలో విషెస్‌రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటున్నారు. పోలీసు క‌మిష‌న‌ర్ కాక‌ముందు ఆయ‌న ఎస్పీగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆర్టీసీ ఎండీగా కూడా ప‌నిచేశారు. ఆయా స‌మ‌యాల్లో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు వేసిన అడుగులు స‌మాజంలో స‌జ్జ‌నార్‌కు ప్ర‌త్యేక గుర్తింపుతోపాటు ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక అభిమానాన్ని కూడా పొందుప‌రిచాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డే వారిని క‌ఠినంగా ఆయ‌న అణిచివేశారు. ఇది మ‌హిళా లోకాన్ని ఆయ‌న‌వైపు చూసేలా చేసింది. ఆర్టీసీఎండీగా ఉన్న‌ప్పుడుఆ ప‌ద‌వికి వ‌న్నెతెచ్చారు. అస‌లు ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం ఉండ‌ని ఆర్టీసీ ఎండీ పోస్టును ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా స్పందించేవారు. ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేసేవారు. ఇక‌, హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా డ్ర‌గ్స్ స‌హాఐబొమ్మ ర‌వి వంటివారిపై ఉక్కుపాదం మోపి అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకున్నారు. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. వీట‌న్నింటికీమించి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని చేరువ చేశారు. ఎవ‌రైనా స్వేచ్ఛ‌గా కార్యాల‌యంలోకి వ‌చ్చి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. మ‌రీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న సోష‌ల్ మీడియాను వ‌ద‌ల్లేదు. స‌మయసంద‌ర్భం ఏది ఉన్నాఆయ‌న వెంట‌నే సోష‌ల్ మీడియాకు క‌నెక్ట్ అవుతారు. ప్ర‌జ‌ల‌కు -స‌జ్జ‌నార్‌కు మ‌ధ్య బాండింగ్ పెంచాయి. ఇదే ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌గా మారింది. సాధార‌ణంగా వ‌చ్చే ప్ర‌మోషనే అయినాఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మంచి పనుల వల్లనే అతనికి మంచి అవకాశం దక్కిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :