ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పురపాలక సంఘం పరిధిలోని 3వ వార్డులో శ్రీను బాబు గడప గడపకు తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి సీపతి బానయ్యకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. మంథని పురపాలక సంఘం పరిధిలోని 3వ వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీపతి బానయ్య హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయిలి ప్రసాద్, మంథని సత్యం, కరుణ కృష్ణ, మెండె రాజయ్య, జమీల్, కొండ శంకర్, ఆనంద్, ఎరుకల ప్రవీణ్, ఆరెల్లి కిరణ్ గౌడ్, నాయకులు, మహిళల నాయకురాళ్ళు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News