Friday, 31 July 2026 01:35:46 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా శ్రీకాంత్ చారి వర్ధంతి

Date : 04 December 2025 01:10 AM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం లో జన సేన పార్టీ, విశ్వ కర్మ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ అమర వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమ వందనాలు అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి మహనీయుడి వర్ధంతి ని జన సేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శ్రీకాంత్ చారి త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలన్నారు. శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిం చాలని డిమాండ్ చేశారు .శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరదన్నారు. ఇలాంటి విరుడిని కన్న వారి తల్లి తండ్రుల కు మా పాదాభివందనాలు తెలియ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకాంత్ చారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, భూమి, ఇల్లు ఇప్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు రామోజివార్. గంగాప్రసాద్, సంతోష్, నర్సయ్య, సాయినాథ్, సురేష్, జాదవ్ ప్రదీప్, శ్రీనివాస్, అనిల్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :