Friday, 19 June 2026 01:22:47 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: - సీఎం రేవంత్‌రెడ్డి

Date : 15 May 2026 11:13 PM Views : 88

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు. తన గీత తాను దాట‌నని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా సీఎం మాట్లాడారు. టీడీపీలో పదేళ్లు ప‌నిచేశాననిసీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికి తనను గౌర‌విస్తారని ప్రస్తావించారు. పార్టీని వ‌దిలిపెట్టిన త‌ర్వాత నాయ‌కుల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం చాలా అరుదని తెలిపారు. పార్టీని వ‌దిలిపెట్టే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పి వ‌చ్చానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను దేశంలో అధికారంలోకి తేవాల‌ని రాహుల్ గాంధీ‌కి ల‌క్ష్యం ఉందని కాని ప్ర‌ధాని కావాల‌న్న ల‌క్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోవాల‌ని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని ప్రస్తావించారు. ఇప్పుడు జ‌నం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి నుంచి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముందు ప్ర‌క‌టించి త‌ర్వాత ఇండియా కూట‌మిని కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఒప్పిస్తామని తెలిపారు. ఇండియా కూట‌మి తరపున ఒక పాల‌సీ డాక్యూమెంటును తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీర్పు ఇవ్వ‌మ‌ని కోర‌తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వ‌ర‌కు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 వ‌ర‌కు తాను తెలంగాణ‌లోనే ఉంటాననిఇక్కడి ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తానని తెలిపారు. ప‌దిశాతం జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా ప‌నిచేస్తానని స్పష్టం చేశారు. 2034 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రినని చెప్పుకొచ్చారు. 2034 త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌నని త‌ర్వాత త‌రానికి అవ‌కాశం ఇస్తానని తెలిపారు. దేశానికి కూడా సేవ‌లందిస్తా అని.. తన అనుభ‌వాన్ని దేశం కోసం పంచుతానని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేసిన తర్వాత.. ఆయ‌న ఏ బాధ్యతలు అప్పగించిన తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: