ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య తిథిని పురస్కరించుకొని బుధవారం మన ఇంటి హారతి కార్యక్రమములో భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు తమ ఇంటి నుండి మంగళహారతి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఉదయం 6 నుండి 6-30 వరకు సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ 45 నిమిషముల పాటు శేజ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబా ఆలయంలో హారతి కార్యక్రమంలో పాల్గొంటే బాబా సంపూర్ణ కృపకు పాత్రులు అవుతారని, కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించడం మన సాంప్రదాయమని ఆయన తెలిపారు.
Admin
E Nivas News