Thursday, 30 July 2026 01:04:40 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థ పై లేదు

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్

Date : 22 October 2025 08:06 PM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థపై లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ (లక్షెట్టిపేట) వార్డెన్ బాలాసంకుల రాజ్ గోపాల్ రావు కి గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన 8 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు రాక మరియు ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో వారి నివాసం లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మరియు స్థానిక బీజేపీ నాయకులు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. బిల్లులు రాక ఆర్ధిక ఇబ్బందులు భరించలేక చివరికి తల్లి గాజులు అమ్మ వలసిన పరిస్థితుల్లో రాజ్ గోపాల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారనిరఘునాథ్ తెలిపారు . విద్యా శాఖ మంత్రి గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంకూడా దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు . ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు గుడ్ల బిల్లులు చెల్లించ లేదన్నారు. అంతేకాకుండా గత మూడు నెలల మధ్యాహ్న భోజన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం క్రమంగా కుప్పకూలే దశకు చేరిందన్నారు . ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు దాటినా, ఇప్పటివరకు పాఠశాల నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. ఈ కారణంగా పాఠశాలలలో చాక్ పీసులు, డస్టర్స్, అవసరమైన సామగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు, కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయే ప్రధానోపాధ్యాయులు వారి జేబుల నుండి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాక వార్డెన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అటు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు జీపీఎఫ్ రాక టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారన్నారు . విద్యా మరియు సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :