ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా రాజారాంపల్లి గ్రామంలో 120 సంవత్సరాల క్రితం గ్రామాన్ని ఏర్పాటు చేసిన ఏలేటి రాజారామ్ రెడ్డి విగ్రహాన్ని ఆయన వారసులు ఏర్పాటు చేయగా ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 120 సంవత్సరాలు క్రితం 200 ఎకరాల భూమిని సంపాదించి అందులో నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు 100 ఎకరాల భూమిని ఇచ్చిన మహనీయుడన్నారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకార్థం అతని మనవడు ఏలేటి చంద్రారెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తూ అతని పేరును నిలబెట్టడం అభినందనీయమన్నారు. ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసే వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News