Wednesday, 17 June 2026 01:46:37 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

మెడికో విద్యార్థులకు ఘన సన్మానం..

Date : 20 March 2026 07:08 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ జిల్లా నర్సంపేట విస్ డం ఉన్నత పాఠశాలలో 2022-2023 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు 2025 నీట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబిబిఎస్ లో సీట్లు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. శరదృతి ఉత్తమ ర్యాంకును సాధించి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో, ముత్తినేని అంకిత ఆదిలాబాద్ లోని రిమ్స్ కాలేజీలో ప్రవేశాలు పొందినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మెడికో విద్యార్థినిలను ఘనంగా సన్మానించారు. అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశ నుండే క్రమశిక్షణను కలిగి తల్లిదండ్రుల పట్ల అభిమానం, ఉపాధ్యాయుల పట్ల గౌరవం తో విద్యను ఆర్జించినప్పుడే అనుకున్న ఫలితాలు సాధిస్తారని, దీనికి నిదర్శనమే మా ఈ విద్యార్థుల ఫలితాలని తెలుపుతూ ఎంబిబిఎస్ లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను అభినందించారు. చాలినంత సన్నాహం పైనే విజయం ఆధారపడి ఉంటుందని అది లేనట్లయితే అపజయం తద్యమని పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ తో తమ కన్న తల్లిదండ్రుల, గురువుల మాటలు వింటూ తమ ప్రతిభను సానబెట్టుకుంటూ, క్రమక్రమంగా అభివృద్ధి చెందాలని తద్వారా తాము కోరుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మెడికో విద్యార్థిని శరదృతి మాట్లాడుతూ నర్సరీ నుండి 10వ తరగతి వరకు తాను ఈ పాఠశాలలోనే చదువుకున్నానని తనకోసం అనునిత్యం పాటుపడిన తల్లిదండ్రులకు, వెన్నంటి ఉండి ప్రోత్సహించిన గురువులకు సదా రుణపడి ఉంటానని, వైద్య వృత్తిలో రాణించి పేదవారికి సేవ చేస్తానని తెలియజేశారు. మరో మెడికో అంకిత మాట్లాడుతూ ఏకాగ్రతతో చదివితే ఫలితాలు వాటంతటవే వస్తాయని, విద్యార్థులు మొబైల్ ఫోన్ లకు, టీవీలకు దూరమై పుస్తకాల వైపు మన మనసును కేంద్రీకరించినప్పుడే అనుకున్న గమ్యం సాధిస్తారని, తన విజయ రహస్యం ఇదేనని పేర్కొన్నారు. విద్యార్థులతల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ, సక్రమ మార్గంలో పయణిస్తూ తమ కన్న తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, తమ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, అకాడమిక్ ఇన్చార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఇన్చార్జి హారిక, మెడికో విద్యార్థినిలు శరదృతి, హారిక, అంకిత, తల్లిదండ్రులు భీమ్ సింగ్, సోమేశ్వర్, ఉపాధ్యాయులు వీరభద్రయ్య, రాము, ఇలియాస్, శివరాజ్, కుమార్, రఘుపతి రెడ్డి, ఎల్ రవీందర్, బి రవీందర్, సుమన్, మధు, మంజుల, శ్రీలత, ఆదిత్య లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: