ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మైనింగ్ అంశంపై అధికార పక్షం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బారాసల మధ్య అసెంబ్లీలో మాటలు యుద్ధం జరిగింది. అక్రమాలపై సవాళ్లు ప్రతి సవాల్ తో సభ దాదాపు గంటలు పైగా హోరెత్తింది, అక్రమ మైండింగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొన్ని సంస్థలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్రషర్లను నడిపిస్తుండడంతో పర్యావరణానికి నష్టంతో పాటు, సర్కార్ ఖజానాకు గండిపడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో అంటుకున్న మైనింగ్ మంటలు ఊహించని టర్న్ తీసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య సాగిన మాటల యుద్ధం విచారణకు ఆదేశించే వరకు వెళ్లడంతో ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనేఆదివారం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గందరగోళం నెలకొంది. సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీవేయాలని. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అయితేబీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే మైనింగ్ అంశంపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకన్నారు. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వొచ్చన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవవడం తగదని హౌస్ కమిటీ వేయాలని నిరసన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు.కాగాఅక్రమ మైనింగ్ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.
Admin
E Nivas News