ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెటిపేట పట్టణానికి చెందిన నంది అవార్డును అందుకున్నాడు. గిన్నెల హనుష్ కుమార్ మంచిర్యాల జిల్లా వారికి ఫోటోగ్రాఫర్ రంగంలో తనదైన ప్రతిభ కనబరచడంతో ఉగాది మహానంది జాతీయ గౌరవ పురస్కారంతో ఆదివారం ఘనంగా సత్కరించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు - 2026నిర్వహణ తెలుగు వెలుగు సాహితీ వేదిక తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విరాట్ విశ్వ కర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళా పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో సన్మానించడంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మండల ప్రజలు అభినందించారు.
Admin
E Nivas News