Thursday, 30 July 2026 04:51:53 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల విధానములో మార్పులు జరిగాయి...

Date : 08 July 2026 11:24 PM Views : 62

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రాక్టికల్స్ పరీక్షల విధానములో ఇంటర్ బోర్డు కీలక మార్పులు జరిగాయి.ఇప్పటివరకు కేవలం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్స్ విధానానికి స్వస్తి పలికి ఇకపై ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక అధికారి క ఉత్తర్వులను విడుదల చేసింది. నూతన విధానం ప్రకారం రెండు సంవ త్సరాల్లోనూ బోర్డు నియమించే ఎక్స్‌ టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరగనున్నా యి. సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథాతథం గా 60 మార్కులకే ఉంటాయి. అయితే, ప్రాక్టికల్స్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించి ప్రథమ సంవత్సరానికి 15 మార్కులు, ద్వితీ య సంవత్సరానికి 15 మార్కుల చొప్పున కేటాయించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్ పరీక్షను 1 గంట 30 నిమిషాల వ్యవధిలో నిర్వహించ నున్నారు. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్లు, నెలవారీ షెడ్యూల్‌తో కూడిన ల్యాబ్ మాన్యువల్స్‌ను బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.ఈ నూతన విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల కు ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం రెగ్యులర్‌గా ప్రాక్టికల్ తరగతులు నిర్వహిం చాలని, పరీక్షల నాటికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చూడాలని పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌ను పరీక్ష సమయంలో సమర్పించాల్సి ఉం టుందని, ల్యాబ్‌లలో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు మార్కులను ఎప్పటిక ప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: